డీసీసీబీ బ్యాంకు సంఘాల అభివృద్ధే లక్ష్యం
ABN, Publish Date - May 29 , 2025 | 11:25 PM
డీసీసీబీ బ్యాంకు సంఘాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో రామాంజనేయులు స్పష్టం చేశారు.
కర్నూలు అగ్రికల్చర్, మే 29 (ఆంధ్రజ్యోతి): డీసీసీబీ బ్యాంకు సంఘాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో రామాంజనేయులు స్పష్టం చేశారు. గురువారం కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రాంగణంలో సీఈవో రామాంజనేయులుకు ఆ సంఘం సీఈవో పుల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంతకాలం సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన ఆప్కాబ్ అధికారి విజయకుమార్‌తో పాటు నాబార్డు డీజీఎం సుబ్బారెడ్డి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అభివృద్ధి అధికారి సుల్తానా బేగం, సంఘం సిబ్బంది లక్ష్మీకాంతరెడ్డి, రిటైర్డు సీఈవో కోటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 11:25 PM