ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పిన ప్రమాదం

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:11 AM

తెలుగుగంగ ప్రధాన కాలువ ఐదో బ్లాక్‌ కింద త్రుటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని జీసీపాలెం, లింగాపురం, రామాపురం గ్రామాలకు చెందిన వేలాది ఎకరాలకు నీరు అందించే ఐదో బ్లాక్‌ తూమ్‌ షెట్టర్‌ రేకు పూర్తిగా కిందికి దిగిపోయింది.

ఐదో బ్లాక్‌కు మరమ్మతులు చేయిస్తున్న అధికారులు

కిందికి దిగిపోయిన తెలుగుగంగ ప్రధాన కాలువ ఐదో బ్లాక్‌ షెట్టర్‌ రేకు

తక్షణమే మరమ్మతులు చేపట్టిన అధికారులు

బండిఆత్మకూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ ప్రధాన కాలువ ఐదో బ్లాక్‌ కింద త్రుటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని జీసీపాలెం, లింగాపురం, రామాపురం గ్రామాలకు చెందిన వేలాది ఎకరాలకు నీరు అందించే ఐదో బ్లాక్‌ తూమ్‌ షెట్టర్‌ రేకు పూర్తిగా కిందికి దిగిపోయింది. దీంతో రైతులకు నీరు అందక పోగా, రేకు మరింత కిందికి దిగిపడిపోతే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం చాలా కష్టం. ఈ విషయాన్ని ఆయా టీడీపీ గ్రామాల నాయకులు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే గంగ డీఈ మురళీకృష్ణ, ఏఈ అర్జున్‌ సింగ్‌ను మరమ్మతులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. దీంతో వారు హుటాహుటిన ఐదో బ్లాక్‌ తూము వద్దకు చేరుకుని, రైతుల సాయంతో దెబ్బతిని కిందకు దిగిపోయిన రేకును మరమ్మతులను చేసి సరిచేశారు. వెంటనే తూము కింద నీటిని వదిలారు. దీంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 31 , 2025 | 12:11 AM