ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన

ABN, Publish Date - May 13 , 2025 | 12:22 AM

రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆర్గనైజేషన్‌ కమిటీ బృందం సోమవారం శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించింది.

జలాశయాన్ని పరిశీలిస్తున్న సీడీవో బృందం

శ్రీశైలం, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆర్గనైజేషన్‌ కమిటీ బృందం సోమవారం శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించింది. శ్రీశైలం జలాశయానికి ప్లాంజ్‌ పుల్‌ గుంత ఏర్పడిన కారణంగా డ్యామ్‌ భద్రత చర్యలు తీసుకునేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించిన అంశాలలో డిజైనింగ్‌ లోపాలను పరిశీలించేందుకు వచ్చినట్లు సీడీవో ఎస్‌ఈ శివప్రసాద్‌ తెలిపారు. పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం జలాశయం బేస్‌మెంట్‌ గట్టిగా ఉందని చెప్పారు. 1986 నుంచి డ్యాం బేస్‌మేంట్‌ సేఫ్టీ కొరకు ఏర్పాటు చేసిన సేఫ్టీ సిలిండర్లలో 12 సిలిండర్లు పాడైపోయాయని తెలిపారు. వాటికి సంబంధించిన మరమ్మతుల చర్యల నిమిత్తం శ్రీశైలానికి వచ్చినట్లు తెలిపారు. ఈ పనులను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా ప్లాంజ్‌ పుల్‌ గుంతకు మరమ్మతులు జరపాలని, డ్యామ్‌ సేఫ్టీ సిలిండర్ల వరకు పర్యవేక్షణ రోడ్డును ఏర్పాటు చేసేందుకు జలవనరులశాఖ అధికారులకు సెంట్రల్‌ డిజైనింగ్‌ కమిటీ ప్లాను అందజేయనున్నట్లు ఎస్‌ఈ తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 12:22 AM