శ్రీశైలంలో భక్తుల రద్దీ
ABN, Publish Date - Jul 28 , 2025 | 10:49 PM
శ్రీశైలంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సోమవారం ఇరు రా ష్ర్టాలకు చెందిన భక్తులు శ్రీశైలం డ్యాంను సందర్శించి అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టినట్లు భక్తులు చెబుతున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగు నీరు, అల్పహారాన్ని అందించారు.
Updated Date - Jul 28 , 2025 | 10:49 PM