ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలం, మహానంది క్షేత్రాల్లో భక్తుల రద్దీ

ABN, Publish Date - Jul 07 , 2025 | 12:23 AM

శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తొలి ఏకాదశి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు.

నంద్యాల, జూలై 6(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తొలి ఏకాదశి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. దీంతో శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. ఇదే క్రమంలో కంపార్ట్‌మెంట్లలో సైతం భక్తులు రద్దీ విపరీతంగా ఉంది. దీంతో దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. వీఐపీ, బ్రేక్‌ టికెట్లకు చెందిన భక్తులను సైతం దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు మూడు విడతలుగా అనుమతి కల్పించారు.

మహానంది: మహానంది క్షేత్రం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేలాదిమంది భక్తులు వీకెండ్‌ను పురస్కరించుకొని శనివారం రాత్రే క్షేత్రానికి చేరుకున్నారు. వేకువజాముననే పుణ్యస్నానాల కోసం క్యూకట్టారు. ప్రధాన ఆలయాల్లోని మహానందీశ్వరున్ని, కామేశ్వరీదేవి అమ్మవార్లను దర్శించుకు న్నారు. నవనంది క్షేత్రాలైన వినాయకనంది, గరుడ నందీశ్వరుని ఆలయాలతో పాటు భారీ నంది విగ్రహానికి పూజలు చేసారు. ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఏర్పాట్లు చేసినట్లు ఏఈవో మధు తెలిపారు.

Updated Date - Jul 07 , 2025 | 12:23 AM