ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాంకేతికతతో నేర నియంత్రణ

ABN, Publish Date - Mar 21 , 2025 | 12:20 AM

: పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి, నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

నేరగాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి

నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి, నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న సీఐడీ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌తో ఎస్పీ మాట్లాడారు. అనంతరం ఎస్పీ జిల్లా పోలీసు అధికారులతో కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌లలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు సలహాలు చేసి మాట్లాడుతూ కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్ని సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో నమోదు చేయాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు సీడీ ఫైళ్లను ఆయా పోలీసు అధికారులు సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేశారో లేదా అని ఆరా తీశారు. ఈ సమీక్షలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ జి. హుశేన్‌ పీరా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణ మోహన్‌, డీఎస్పీలు బాబు ప్రసాద్‌, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్‌రావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:20 AM