పత్తి ధర క్వింటా రూ.7,979
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:10 AM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు
ఆదోని అగ్రికల్చర్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం పత్తి ధర క్వింటా గరిష్ఠంగా రూ.7,979 పలికింది. సాధారణంగా ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న సమయంలో పత్తి ధరలు రైతులు పెరుగుతాయి. కానీ ధరలు పెరగకపోవడంతో పత్తి రైతులు నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం మార్కెట్‌కు 216 క్వింటాళ్లు విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.5,369, గరిష్ఠంగా రూ.7,979, సగటున రూ.7,709 పలికింది.
Updated Date - Jun 18 , 2025 | 12:10 AM