ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీకర్‌ సెక్షన కాలనీలో కార్డన సెర్చ్‌

ABN, Publish Date - Apr 06 , 2025 | 12:55 AM

ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన పరిధిలోని వీకర్‌సెక్షన కాలనీలో పోలీసులు కార్డన సెర్చ్‌ ఆపరేషన నిర్వహించారు.

వీకర్‌ సెక్షన కాలనీలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

కర్నూలు క్రైం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన పరిధిలోని వీకర్‌సెక్షన కాలనీలో పోలీసులు కార్డన సెర్చ్‌ ఆపరేషన నిర్వహించారు. శనివారం డీఎస్పీ బాబు ప్రసాద్‌ ఆధ్వర్యంలో కర్నూలు సబ్‌ డివిజన సీఐలు, ఎస్‌ఐలు స్పెషల్‌ పార్టీ, ఆర్ముడు పోలీసులు బృందాలుగా ఏర్పడి కాలనీలోని రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఆయా వీధుల్లో కవాతు నిర్వహించారు. తనిఖీల్లో ఎరుకలి నరసింహ వద్ద 20 ప్యాకెట్ల రేషన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాహనపత్రాలు సరిగా లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ బాబు ప్రసాద్‌ కాలనీ ప్రజలతో మాట్లాడుతూ ఎవరూ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాల జోలికి వెళ్లరాదన్నారు. కార్యక్రమంలో నాలుగో పట్టణ సీఐ మధుసూదనగౌడు, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన, కోడుమూరు సీఐ తబ్రేజ్‌, సబ్‌ డివిజన ఎస్‌ ఐలు, పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:55 AM