జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్
ABN, Publish Date - Mar 24 , 2025 | 12:04 AM
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లతోపాటు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
నంద్యాల క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లతోపాటు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల క్యూఆర్టీ టీం సిబ్బంది, స్థానిక పోలీసులు బృందాలుగా ఏర్పడి కార్డెన్‌సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్డెన్‌సెర్చ్‌లో భాగంగా అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాల్లేని 51మోటార్‌సైకిళ్లు, 6 ఆటోలు, 9 క్వార్టర్‌బాటిళ్లు, 10 లీటర్ల నాటుసారాను సీజ్‌చేసినట్లు తెలిపారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్: ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
Updated Date - Mar 24 , 2025 | 12:05 AM