తరగతి గదుల బదిలీపై దుమారం
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:59 AM
రామచంద్ర నగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతి గదులను సంతమా ర్కెట్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేయడంపై మండల సర్వసభ్య సమావేశంలో దుమారం రేపింది.
ఎంఈవోపై ప్రజాప్రతినిధులు, అధికారుల ఆగ్రహం
జీతాలు అందకపోవడంతో ధర్నా చేస్తామన్న ఎంపీటీసీలు
ప్రజల దాహం తీర్చేందుకు చర్యలు చేపట్టాలి: ఎంపీపీ
గంటన్నర లోపే ముగిసిన సర్వసభ్య సమావేశం
మంత్రాలయం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రామచంద్ర నగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతి గదులను సంతమా ర్కెట్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేయడంపై మండల సర్వసభ్య సమావేశంలో దుమారం రేపింది. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గిరిజమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో రాధ, ఈవోఆర్‌డీ ప్రఽభావతిదేవి నిర్వహించారు. ఎంఈవో-1 మైనుద్దీనపై ఎంఈవో-2 రాఘవేంద్ర, సర్పంచ తెల్లబండ్ల భీమయ్య, మంత్రాలయం ఎంపీటీసీలు వెంకటేశశెట్టి, మేకల వెంకటేశ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే, ఎంపీపీ, పాఠశాల పంచాయతీ తీర్మానాలు లేకుండా ఎలా తరగతులను చేర్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాఠశాల తరగతులను బదిలీ చేస్తే ఎంఈవో దిష్టిబొమ్మను రాఘవేంద్ర సర్కిల్‌లో గ్రామంతా కలిసి దహనం చేస్తామని హెచ్చ రించారు. ఇందులో విద్య, వైద్యం, పశువైద్యం, గృహ నిర్మాణం, తాగునీరు, రెవెన్యూ ఉపాధి, సెల్ప్ హెల్త్ గ్రూప్స్, ఐసీడీఎస్, పంచా యతీరాజ్ రోడ్లు, పరిశుభ్రత విద్యుత వంటి అంశాలపై చర్చించారు. 12 గంటలకు ప్రారంభమైన మండల సర్వసభ్య సమావేశం గంటన్నర లోపే ముగించారు. తమ శాఖకు సంబంధించిన సమావేశాన్ని సభలో చర్చించి వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలతోనే సమావేశం ముగించారు. మాధవరం ఎంపీటీసీ ఈరన్న మాట్లాడుతూ రెండేళ్లుగా ఎంపీటీసీలకు జీతాలు ఇవ్వడం లేదని, జీతాలివ్వకపోతే ఎంపీటీసీలంతా ధర్నా, నిరసన చేస్తామని తెలిపారు. వెంటనే జీతాలు మంజూరు చేయాలని కోరారు. పల్లె పండుగలో భాగంగా రూ.2.50 కోట్లతో వేసిన పంచాయతీరాజ్ రోడ్లుకు ఇంత వరకు బిల్లులు రాలేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడతగా రూ.1.30 కోట్లు రోడ్లకు మంజూరైందని ఏఈ మల్లయ్య తెలిపారు. ఎంపీపీ గిరిజమ్మ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో ప్రజల దాహర్తిని తీర్చేందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్క గ్రామానికి నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. జడ్పీ నిధుల కింద రచ్చుమర్రికి రూ.8.50 లక్షలు, ఖగ్గల్లు రూ.8.50 లక్షలు, రచ్చుమర్రి సీసీ రోడ్లకు రూ.15 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కొంతమంది అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం తో తూతూ మంత్రంగా తాము నివేదిక తెచ్చిన సమాచారాన్ని చదివి అధికారులు వెళ్లిపోవ డంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వైస్ ఎంపీపీ రాఘవేంద్ర, వ్యవసాయ కమిటి చైర్మన సీవీ విశ్వనాథరెడ్డి, ఏఈలు మల్లయ్య, వెంకట్రాముడు, ఏపీవో భక్తవత్సల, ఏపీఎం రాజశేఖర్, సర్పంచులు ముకురన్న, ఎంపీటీసీలు రామాంజనేయులు, చిన్నన్న, గ్రామ కార్యదర్శులు వేణుగోపాల్, ఇస్రత బాషా, స్వామినాథన, మహేష్, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 12:59 AM