ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్డీటీ సేవలను కొనసాగించాలి

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:31 AM

పేదలకు సేవలు చేసే రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

ఆలూరులో ర్యాలీ చేస్తున్న గ్రామస్తులు

ఆలూరు, త్గుగలి, మద్దికెర మండలాల్లో నాయకులు, ప్రజల నిరసన

ఆలూరు, జూన్‌19(ఆంధ్రజ్యోతి): పేదలకు సేవలు చేసే రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆలూరు పట్టణంలో గురువారం ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. గ్రామాల్లో పాఠశాలలు, గృహాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించి ఎందరో పేద విద్యార్థులకు విద్య అందిస్తోందన్నారు. ఆర్డీటీ సేవలు నిలిచిపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్‌డీటీ సంస్థను కాపాడండి

తుగ్గలి: పేదలకు ఉచిత విద్య, వైద్యసేవలతో పాటు గృహాలు నిర్మిస్తున్న ఆర్‌డీటీ సంస్థను కాపాడాలని సీపీఐ కార్యదర్గ సభ్యుడు నబీ రసూల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో పేదలు అభివృధ్ది చెందారని, సంస్థపై ఆంక్షలు విధించి, ఇబ్బందులు పెట్టడాన్ని ఖండించారు. అనంతరం తహసీల్దార్‌ రవికి వినతి పత్రం అందజేశారు. సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములు, సీపీఐ నాయకులు వెంకటేశ్వర్లు తదితరుల ఉన్నారు.

ఆర్‌డీటీ సేవలను కొనసాగించాలి

మద్దికెర: ఆర్‌డీటీ సేవలను యథావిధిగా కొనసా గించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఎం.అగ్రహారం ఆనంద్‌ కుమార్‌, కొత్తపల్లి నాగరాజు డిమాండ్‌ చేశారు. గురువారం దివ్యాంగుల ఆధ్వర్యంలో సేవ్‌ ఆర్‌డీటీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ గుండాల్‌ నాయక్‌కు విని పత్రం అందజేశారు. ఏసన్న, రాంబాబు, వెంకటేశ్వర్లు ఫక్కీరప్ప, రంగన్న నాగరాజు, వెంకట్రాముడు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:31 AM