ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలు

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:50 AM

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, అరాచకం, దోపిడీ వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఆపార్టీ కుట్రలు పన్నుతోందని, ఈ వెన్నుపోటుకు భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

వైసీపీ వెన్నుపోటుకు భయపడేది లేదు

కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన, జూన 4(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, అరాచకం, దోపిడీ వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఆపార్టీ కుట్రలు పన్నుతోందని, ఈ వెన్నుపోటుకు భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ వెన్ను పోటు నిరసనలకు ఎవరూ భయప డేది లేదన్నారు. జగన చేసిన అరాచక, విధ్వంసానికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులను అందరిని కేసుల్లో ఇరికించి జగన రెడ్డి లండన పారిపోబోతున్నారనే విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యా ణ్‌లు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. వీటిని జగన జీర్ణించుకోలేకపోతు న్నారని మండిపడ్డారు. అన్నక్యాంటీన, మోగా డీఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ ప్లాన నిధులు అన్నింటికి వెన్నుపోట్లు పొడిచి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన వైసీపీ వెన్నుపోటు దినం జరపడం హాస్యాస్పద మన్నారు. కార్పొరేషన డైరెక్టర్లు ధరూర్‌ జేమ్స్‌, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవీకుమార్‌, కొంకతి లక్ష్మీనారాయణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు అబ్బాస్‌, కార్పొరేటర్‌ పద్మలతారెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు వి.హనుమంతరావుచౌదరి, నాయకులు నాగరాజుయాదవ్‌, తిరుపాల్‌ బాబు, పుల్లయ్యచౌదరి పాల్గొన్నారు.

వెన్నుపొటు అట్టర్‌ ప్లాప్‌

వైసీపీ చేపట్టిన వెన్నుపొటు దినం కార్యక్రమం అట్టర్‌ ప్లాప్‌ అయ్యి ందని కర్నూలు మండలం సర్పంచలు, ఎంపీటీసీలు ఽధ్వజమెత్తారు. బుధ వారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు మండలంకు చెందిన గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. పంచలింగాల సర్పంచ క్రిష్ణ మాట్లాడుతూ ముందు ముగినిపోతున్న వైసీపీని కాపాడుకోవాలని కోరారు. మండల టీడీపీ ప్రెసిడెంట్‌ బుర్రా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సొంత చిన్నానను గొడ్డలిుతో హత్యచేసిన జగన పెద్ద వెన్నుపోటుదారుడిని మండిపడ్డారు. మాజీ సర్పంచ, సీనియర్‌ నాయకుడు వేమన్న గౌడ్‌ వ డివీఎంసీ మెంబర్‌ మద్దిలేటి, బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి, హెచడీఎస్‌ మెంబర్‌ బోయ రామాజనేయులు, జయన్న, శంకర్‌నాయుడు, మద్దిలేటీ, గార్గేయపురం సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:50 AM