యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:18 PM
ప్రతి రోజూ యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది పేర్కొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది
కర్నూలు లీగల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రతి రోజూ యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ది పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులతో యోగా చేయించారు. న్యాయశాఖ సిబ్బందికి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, పలువురు న్యాయాధికారులు, పాల్గొన్నారు. యోగా మాస్టర్ ముంతాజ్ బేగం న్యాయాధికారులతో, న్యాయవాదులతో యోగాసనాలు చేయించారు.
Updated Date - Jun 21 , 2025 | 11:18 PM