ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహానాడుకు తరలిరండి: మంత్రి

ABN, Publish Date - May 26 , 2025 | 12:10 AM

మహానాడుకు తరలిరండి: మంత్రి

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌ , మే 25 (ఆంధ్రజ్యోతి): ఈనెల 27, 28, 29 వతేదిలలో కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తరలి రావాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన పలువురు నాయకులతో కీలక బేటి నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మహానాడుకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు రవాణా, వసతి, భద్రతపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర సన్నాహాలు చేయాలని స్వష్టం చేశారు. ప్రతి కార్యకర్త సేవాదృక్పథంతో, అంకితభావంతో మహానాడును విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. పార్టీ నంద్యాల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకుడు, శాసన మండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్‌, నంద్యాల పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి పోతురాజు రవికుమార్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:10 AM