ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతులకు ఆన్‌లైన్‌ గుర్తింపు నెంబర్‌

ABN, First Publish Date - 2025-01-30T00:29:10+05:30

కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల గుర్తింపు కోసం ప్రత్యేక ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చింది. 26న గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రంలో ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది.

ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రారంభించిన కేంద్రం

ఆధార్‌ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్య

కొలిమిగుండ్ల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల గుర్తింపు కోసం ప్రత్యేక ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చింది. 26న గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రంలో ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభిం చనున్నారు. దీని ద్వారా ప్రతి రైతుకూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ తరహాలో 14 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తుంది. ఇది దేశంలో రైతు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఈ గుర్తింపు కార్డుల ద్వారా రైతులను అప్రమత్తం చేస్తారు. వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. వ్యవసాయ పథకాలను నేరుగా చేరవే స్తారు. పంట నష్టం, ప్రకృతి వైపరీత్యాలు, బీమా పరిహారంలో ఈ గుర్తింపు కార్డు ఎంతో ఉపయోగకరం కానుంది. రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. స్థానిక రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి, తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు అన్‌లైన్‌ అవగాహన ఉన్న రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, లేదా వెబ్‌ పోర్టల్‌లో స్వయంగా కూడా నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

రైతులు నమోదు చేసుకోవాలి

రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆధార్‌ కార్డు, రైతు పొలం 1.బి ఆధార్‌తో లింక్‌ ఉన్న మొబైల్‌ నంబరుతో స్థానిక రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలి. అన్‌లైన్‌లో నమోదు తర్వాత రైతులకు 14 అంకెలతో కూడిన వ్యక్తిగత గుర్తింపు సంఖ్య ఇస్తారు. - భూమా జ్యోతి, ఏవో.

Updated Date - 2025-01-30T00:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising