దివ్యాంగులకు అండదండలు అందిస్తాం
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:05 AM
దివ్యాంగులకు అండదండలు అందించడమే తమ ధ్యేయమని డీఈఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మల్లెల ఆల్ర్ఫెడ్ రాజు అన్నారు. మంగళవారం నగరంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో దివ్యాంగుల సాధికారత ఫోరం (డీఈఎఫ్) ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించారు.
డీఈఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మల్లెల ఆల్ర్ఫెడ్ రాజు
ఘనంగా డీఈఎఫ్ ఆవిర్భావ వేడుకలు
కర్నూలు కల్చరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు అండదండలు అందించడమే తమ ధ్యేయమని డీఈఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మల్లెల ఆల్ర్ఫెడ్ రాజు అన్నారు. మంగళవారం నగరంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో దివ్యాంగుల సాధికారత ఫోరం (డీఈఎఫ్) ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. డీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెక్రెడ్ సంస్థ డైరెక్టర్ తిప్పన్న, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఈ.నాగరాజుగౌడ్, దివ్యాంగుల ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ క్రిష్ణుడు, టీడీపీ దివ్యాంగుల సేవా విభాగం సెక్రటరీ నీలా జోజిబాబు, డీఈఎఫ్ ప్రధాన కార్యదర్శులు ఎం. శివశంకర్, కె.ఈరన్న, ఉపాధ్యక్షుడు కమతం వెంకటేశ్, కోశాధికారి ఆదిశేషయ్య, సలహాదారుడు రామాంజనేయులు మాట్లాడారు. దివ్యాంగుల సాధికారిత కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎప్పుడూ వెన్నంటి ఉంటామని చెప్పారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేలా వారికి తగిన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. దివ్యాంగులుకు సంబంధించిన సామాజిక హక్కుల, చట్టాల, రాయితీ రిజర్వేషన్ల కోసం తమ సంస్థ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ఇటు దివ్యాంగులకు ఒక వారధిగా నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు డీఈఎఫ్‌ను బలపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల డీఈఎఫ్ కార్యవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 12:06 AM