సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN, Publish Date - May 16 , 2025 | 12:54 AM
ఈనెల 17న కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకట రెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, మే 15(ఆంధ్రజ్యోతి): ఈనెల 17న కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకట రెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లూరు రూరల్, అర్బన నాయకు లతో గౌరు దంపతులు, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాణ్యం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ కల్లూరు మండల కన్వీనర్ డి.రామాంజనేయులు, వాకిటి మాదేష్, పాల్గొన్నారు.
ఓర్వకల్లు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభను జయప్రదం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. ఈనెల 17న పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు కల్లూరు అర్బన 20వ వార్డులో సభ నిర్వహించనున్నారు. గురువారం ఓర్వకల్లులోని జీవేశ్వ రస్వామి కల్యాణ మండపంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆమె, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు సభకు మండలం నుంచి 10వేల మంది దాకా సభకు వచ్చేలా ప్రణా ళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీ నర్ గోవిందరెడ్డి, పాణ్యం వాణిజ్యం విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, సుధాకర్‌రావు, విజ యుడు, శ్రీనివాసులు, ఏసేపు, మహబూబ్ బాషా, అల్లాబాబు, యాసీ న, ఖాజా మియా, చంద్రశేఖరప్ప, శ్రీనివాసులు, శోభన పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టులో కలెక్టర్, ఎస్పీ భద్రతా ఏర్పాట్లు పరిశీలన:
సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పి.రంజిత బాషా, ఎస్పీ విక్రాంత పాటిల్ గురువారం సాయంత్రం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు.
Updated Date - May 16 , 2025 | 12:54 AM