సీఎం లక్ష్యం..ఆరోగ్యాంధ్ర
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:12 PM
ఆరోగ్యాంధ్రయే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు.
జిల్లాలో 12.76 లక్షల మంది రిజిస్ట్రేషన్
యోగా దినోత్సవంలో కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యాంధ్రయే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని అవుట్‌డోర్ స్టేడియంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ బి. నవ్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా అధికారులు యోగాభ్యాసకులు పాల్గొని యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2.39 కోట్ల మంది రిజిస్ర్టేషన్ చేసుకుంటే అందులో అత్యధికంగా కర్నూలు ఇల్లా నుంచి 12.76 లక్షల మందిని రిజిస్ర్టేషన్ చేయగలిగామన్నారు. నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో యోగాకు సంబంధించిన పోటీలు నిర్వహించామని, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా పోటీల్లో పాల్గొన్నారని, పోటీల్లో గెలుపొందినవారికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యా యులు, క్రీడాకారులు, యోగాభిమానులు సుమారు 5వేల మందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. ఆర్డీవో సందీప్‌కుమార్, డీఈవో శామ్యూల్‌పాల్, డీఎస్‌డీవో బి.భూపతిరావు, సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, 28(ఏ) బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ప్రసాద్ 9(ఏ) గర్ల్స్ బెటాలియన్ ఆఫీసర్ శ్రీప్రియ, ఆయుష్ డిపార్టుమెంటు సభ్యులు, క్రీడాపాధికార సంస్థ ప్రతినిధులు, యోగాభ్యాసకులు, వ్యాయామ ఉపాధ్యా యులు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:12 PM