ఉమ్మడి జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి
ABN, Publish Date - May 15 , 2025 | 11:56 PM
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ జిల్లా అధ్య క్షులు తిక్కారెడ్డి అన్నారు.
రేపటి పర్యటనను విజయవంతం చేద్దాం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులతో సమావేశం
కర్నూలు అర్బన్, మే 15(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ జిల్లా అధ్య క్షులు తిక్కారెడ్డి అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 17న జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంతో పాటు నగర శివారులో ప్రజావేదిక ద్వారా పలుఅంశాలపై మాట్లాడతారని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి సమానం చేయాలనే లక్ష్యంతో పాణ్యం నియోజకవర్గ పర్యటన చేపట్టారని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేశారన్నారు. జూన్ 12న తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లో ప్రకటించిన మేరకు మొత్తాన్ని జమ చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో నంద్యాల నాగేంద్ర, కాసాని మహేష్‌గౌడ్, సత్రం రామక్రిష్ణుడు, బేతం కృష్ణుడు, హనుమంతరావు చౌదరి, నంది మధు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 11:56 PM