రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:33 AM
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం
14న తల్లికి వందనం డబ్బులు జమ
24 నెలల్లోనే హైవే నిర్మాణ పనులు పూర్తి చేయాలి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
కోవెలకుంట్ల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోవెలకుంట్లలోని కుందూ నది పక్కనే ఉన్న ఎన్‌హెచ్ 167కేలో నంద్యాల నుంచి కర్నూలు, కడప జిల్లాల సరిహద్దు సెక్షన్ వర్క్ షేస్ట్‌షోల్డరుతో కూడిన రెండు వరసల రహదారి నిర్మాణానికి మంత్రి బీసీ ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుంటే వైసీపీ నాయకులు విమర్శించడం తగద్నారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి ఈనెల 14వ తేదీ లోపు డబ్బులు జమ చేస్తారన్నారు. జూన్‌నెలలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తారని, ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేసి తీరుతుందన్నారు. ఎన్‌హెచ్ 167కే హైవే పనులు 24 నెలల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా వాసులు బెంగుళూరు వెళ్లడానికి ఈ నేషనల్ హైవే రహదారి ఎంతో వీలుగా ఉంటుందన్నారు. ఈ రహదారితో కడప, నంద్యాల జిల్లావాసుల జీవనాధారం మెరుగుపడుతుందని, రెండు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, బనగానపల్లె మార్కెట్‌యార్డు చైౖర్మన్ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, టీడీపీ నాయకులు గువ్వల సుబ్బారెడ్డి, అమడాల మద్దిలేటి, శ్రీనిధి హోటల్ మద్దిలేటి, కలుగొట్ల అర్జున్‌రెడ్డి, వెలగటూరు ధనుంజయుడు, బిజినవేముల హుసేనయ్య, గోవిందిన్నె బాలరాజు, చిన్నకొప్పుర్ల బుచ్చన్న, లింగాలనాయుడు, గోవర్ధనరెడ్డి, సునీల్‌రెడ్డి చెప్పలి సుదర్శన్‌రెడ్డి, పెనుగొండ రాజశేఖర్, కుళాయి బాషా పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 12:33 AM