వైద్య శాఖ బదిలీలపై స్పష్టత
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:07 AM
వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలపై కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులతో బుధవారం మధ్యాహ్నం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కర్నూలు డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళ, కార్యాలయ ఏవో కే.అరుణ పాల్గొన్నారు.
కమిషనర్ జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీఎంహెచ్‌వో
కర్నూలు హాస్పిటల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలపై కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులతో బుధవారం మధ్యాహ్నం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కర్నూలు డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళ, కార్యాలయ ఏవో కే.అరుణ పాల్గొన్నారు.
3 నుంచి 9 ఏళ్లలోపు జిల్లా కేంద్రంలో పని చేస్తున్న గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘం ఆఫీస్ బ్యారర్ల (మినిస్టీరియల్)లను లోకల్ స్టేషన్‌కు బదిలీ చేయాలి. ఒకవేళ కోరిన స్టేషన్ లేకపోతే కోరిన స్థానాన్ని ఇవ్వాలి.
గుర్తింపు పొందిన ఆఫీస్ బ్యారర్ల ఉన్న మినిస్టీరియల్ స్టాఫ్ 3 నుంచి 9 సంవత్సరాలు దాటితే బయటి స్టేషన్‌కు వెళ్లాలి.
ఐదేళ్లు దాటిన మినిస్టీరియల్ స్టాఫ్, పారా మెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ఇతర ఉద్యోగులు ఖచ్చితంగా బదిలీ కావాలి.
ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) బదిలీలకు సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ చేయాలి. 2025 మే 31 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్రమే అభ్యర్థన బదిలీలకు అర్హులు.
బదిలీ కోరుతున్న ఉద్యోగులు ఐదు ప్రాధాన్యత స్థలాలు ఇవ్వాలి. ఒక స్థలానికి ఎక్కువ మంది కోరితే స్టేషన్ సీనియారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఎంపిక చేయకపోతే ఖాళీల ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలి. ప్రతి గ్రామీణ ఆరోగ్య కేంద్రం, హెడ్ క్వార్టర్ సబ్ సెంటర్‌లో కనీసం ఒక ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్) ఉండేలా చూడాలి.
బదిలీలపై గందరగోళం..
వైద్యఆరోగ్య శాఖలో వివిధ క్యాడర్లలోని వైద్యులు, పారామెడికల్, ఇతర విభాగాల ఉద్యోగుల బదిలీలపై గత నెల 31వ తేదీ అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 5వ తేదీ బదిలీల దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది. కానీ నేటి వరకు ఆర్‌డీ అధికారులు క్లియర్ వెకెన్సీ వివరాలు పంపించారు. కానీ లాంగ్ స్టాండింగ వెకెన్సీ ఉద్యోగుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. దీంతో బదిలీలు కోరుకునే లాంగ్ స్టాండింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నోటీసు బోర్డులో కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం విశేషం. కొత్తగా బదిలీల షెడ్యూల్, రివైజ్డ్ లాంగ్ స్టాండింగ్, క్లియర్ వెకెన్సీ లిస్టు విడుదల చేసి దరఖాస్తుల తేదీ, గ్రీవెన్స్ తేదీని ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే గుర్తింపు పొందిన ఉద్యోగ లెటర్ ప్యాడ్‌పై ఉన్న శ్రద్ధ బదిలీ మార్గదర్శకాలు, అధికారులు అలసత్వం బదిలీల అపోహలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:07 AM