ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందజేయాలి

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:22 AM

భారతీయ శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత నృత్య గురువు లపై ఉందని రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పుల్లయ్య

రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): భారతీయ శాస్త్రీయ నృత్య కళలను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత నృత్య గురువు లపై ఉందని రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య అన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవం, టీజీవీ కళాక్షేత్రంలో కొనసాగిన కూచిపూడి, భరత నాట్యం వర్క్‌షాపు ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక కాలంలో శాస్త్రీయ కళలు మరుగున పడ కుండా అనునిత్యం శిక్షణలతో ముందుకు వస్తున్న నృత్య గురువులం దరూ అభినందనీయులని ప్రశంసించారు. హైదరాబాదు స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స డైరెక్టర్‌, నృత్య గురువు పద్మ కల్యాణి మాట్లాడుతూ కర్నూలులో వర్క్‌షాపు ఏర్పాటు చేసి శాస్త్రీయ కళారీతుల ఉనికిని చాటిచెప్పడం అభినందనీయమన్నారు. కూచిపూడి నృత్య గురువు ఎస్‌ కరీముల్లా మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం, శ్రీనటరాజ నృత్య కళామందిర్‌ సం యుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాపును విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ పొందిన నృత్య కళాకా రుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా నృత్య గురువులను ఎస్‌ కరీముల్లా శాలువ, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నృత్య గురువు పఠాన మొహిద్దీన, విజయవాడ భరత నాట్యం నృత్య గురువు ఎ.సంతోష్‌, నటరాజ నృత్య కళామందిర్‌ కార్యవర్గ కమిటీ ప్రతినిధులు డాక్టర్‌ స్వరూప్‌ సిన్హా, కేపీఆర్‌ శర్మ, కె.సునీత పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:22 AM