ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలోనే తరగతులు ప్రారంభిస్తాం

ABN, Publish Date - May 11 , 2025 | 12:11 AM

పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో కేంద్రీయ విద్యాలయం తరగతులు త్వరలోనే ప్రారంభిస్తామని కలెక్టర్‌ రాజకుమారి గనియా అన్నారు.

డోన్‌ కేంద్రీయ విద్యాలయం ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

కేంద్రీయ విద్యాలయ భవనం పరిశీలన

డోన్‌ టౌన్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో కేంద్రీయ విద్యాలయం తరగతులు త్వరలోనే ప్రారంభిస్తామని కలెక్టర్‌ రాజకుమారి గనియా అన్నారు. శనివారం నూతన భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కర్నూలు కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్‌ను తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారని కలెక్టర్‌ ప్రశ్నించారు. విద్యాలయ కమిషనర్‌కు లెటరు పంపించామని, అక్కడి నుంచి ఆదేశాలు రాగానే ప్రారంభిస్తామని వివరించారు. అనంతరం పట్టణంలోని దొరపల్లె సమీపాన ఉన్న జగనన్న లేవుట్‌ కాలనీని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కాలనీలో లబ్దిదారులకు సదుపాయాలు ఎందుకు కల్పించలేదని మున్సిపల్‌ శాఖ అధికారులను ప్రశ్నించగా.. గోరుకల్లు రిజర్వాయరు నుంచి జీడీపీ నుంచి తాగునీటి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ను కమిషనర్‌ను కోరారు. నీటి సదుపాయాలు లేకపోవడంతో లబ్దిదారులు నివాసానికి విము ఖుత చూపుతున్నారన్నారు. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఈవో జనార్దన్‌ రెడ్డి, ఆర్డీవో నరసింహులు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, తహసీల్దార్‌ నాగమణి, ఎంఈవో ప్రభాకర్‌, కర్నూలు కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్‌ ప్రియదర్శిని, మున్సిపల్‌ డీఈ రఘు, ఏఈ సురేష్‌, హౌసింగ్‌ ఏఈ వీరేష్‌, సర్వేయర్‌ జగదీష్‌, అధికారులు ఉన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:11 AM