నమ్మించి.. మోసగించాడు
ABN, Publish Date - May 17 , 2025 | 12:30 AM
రైతన్నను నమ్మించి మోసగించాడు ఓ బడి పంతులు. దిక్కు తోచని స్థితిలో ఆరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.
అన్నదాతను దగా చేసిన బడి పంతులు
పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
ఆళ్ళగడ్డ, మే 16(ఆంధ్రజ్యోతి): రైతన్నను నమ్మించి మోసగించాడు ఓ బడి పంతులు. దిక్కు తోచని స్థితిలో ఆరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాలు.. స్థానిక ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ పాఠశాలలో బాబు అనే వ్యక్తి టీచర్ పనిచేస్తున్నాడు. రైతు కోటేశ్వరరావుకు చెందిన పొలాన్ని తీసుకుని ప్లాట్లు వేసేందుకు బాబు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కొంత అడ్వాన్స్‌ను రైతు చెల్లించాడు. వెంచర్ వేసి ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. చివర్లో లెక్కలు చేసి డబ్బులు ఇస్తానని నమ్మి బలికి విడతలవారీగా డబ్బులు ఇస్తూ మొత్తం పొలం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాడు. తనకు రావాల్సిన పదిలక్షలు చెల్లించాలని రైతు అడిగాడు. దీంతో అతడిని బెదిరించాడు. కోటేశ్వరరావు అధికారులను, నాయకులను ఆశ్రయించినా ఫలితం లేదు. దీంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు రైతును హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ఆస్ప్రతికి తరలించారు. ఉన్నతాధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని బాధిత రైతు కోరుతున్నాడు.
Updated Date - May 17 , 2025 | 12:30 AM