పన్ను వసూళ్లలో గోల్‌మాల్
ABN, Publish Date - May 01 , 2025 | 12:35 AM
మండలంలోని మద్దికెర మజారా గ్రామం బొజ్జనాయనిపేటలో ఇంటి పన్నుల వసూళ్లలో గోల్‌మాల్ జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కట్టిన పన్నులకు రసీదు చూకపోతే మళ్లీ పన్నులు కట్టాల్సి వస్తోందని, గ్రామస్థులు లబోదిబో మంటున్నారు.
ప్రైవేటు వ్యక్తులచే వసూళ్లు
తేదీ లేకుండానే రసీదు..
రసీదు చూపకుంటే మళ్లీ కట్టాలని హుకుం
బొజ్జనాయనిపేట వాసుల అవస్థలు
మద్దికెర, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దికెర మజారా గ్రామం బొజ్జనాయనిపేటలో ఇంటి పన్నుల వసూళ్లలో గోల్‌మాల్ జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కట్టిన పన్నులకు రసీదు చూకపోతే మళ్లీ పన్నులు కట్టాల్సి వస్తోందని, గ్రామస్థులు లబోదిబో మంటున్నారు.
గ్రామంలో 5వేల గృహాలకు పైగా ఉండగా, ఏడాదికి రూ.15 నుంచి రూ.18 లక్షల వరకు పన్నులు రూపంలో వసూలు చేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఇంటి పన్నులు వసూలు చేసే బాధ్యతను ప్రైవేటు సిబ్బందికి అప్పగించారు. ప్రజలు పన్నులు చెల్లించారు. 2024-25 సంవత్సరానికి కూడా ఇలాగే ప్రైవేటు సిబ్బంది వసూలు చేస్తున్నారు.
అయితే గ్రామస్థులు రామాంజులు, ఈశ్వరయ్య, రాముడు, మరికొందరు తాము 2022-23, 2023-24 సంబందించి ఇంటి పన్నులు చెల్లించామని, అయితే పంచాయతీ అధికారులను సంప్రదించగా, రసీదు చూపాలంటున్నారని, అలా చూపకుంటే మళ్లీ పన్నులు చెల్లించాల్సిందేనని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తేదీ లేకుండా రసీదు
పంచాయతీ సిబ్బంది ఇచ్చే రసీదులో తేదీ ఉండకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో కూడా పంచాయతీ సిబ్బంది రూ.5 లక్షల వరకు ఇంటి పన్నులను వసూలు చేసి పంచాయతీకి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రసీదు తీసుకురావాలి
ఇంటి, నీటి పన్నులు కట్టేవారు తప్పకుండా రసీదు తీసుని వాటిని తమవద్దే ఉంచుకోవాలి. రసీదు చూప కుంటే మేమేమీ చేయలేం. ముగ్గురు ప్రైవేటు వ్యక్తులచే పన్నులు వసూలు చేస్తున్నాం, వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నాం. అవినీతికి తావివ్వకుండా చూస్తున్నాం. - శివకుమార్, కార్యదర్శి
Updated Date - May 01 , 2025 | 12:35 AM