బంగారం పేరుతో మోసం
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:55 AM
తక్కువ ధరకు బంగారం ఇప్పించి, ఎక్కువ ధరకు అమ్మిస్తామని నమ్మించి రూ.48.50 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడు రంగు నాగేష్ అలియాస్ నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్, టూటౌన్ సీఐ నాగరాజరావు, త్రీటౌన్ సీఐ శేషయ్య శుక్రవారం నిందితుని వివరాలు వెల్లడించారు.
నిందితుడి అరెస్టు
రూ.45.91లక్షల రికవరీ
కర్నూలు క్రైం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకు బంగారం ఇప్పించి, ఎక్కువ ధరకు అమ్మిస్తామని నమ్మించి రూ.48.50 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడు రంగు నాగేష్ అలియాస్ నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్, టూటౌన్ సీఐ నాగరాజరావు, త్రీటౌన్ సీఐ శేషయ్య శుక్రవారం నిందితుని వివరాలు వెల్లడించారు. హైదరాబాదు సరూర్‌నగర్‌కు చెందిన సంతోషిమాత అనే మహిళకు నిందితుడు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. రూ.60 లక్షలు డబ్బులు ఇస్తే. కేజీ బంగారం కొని మళ్లీ అదే బంగారాన్ని రూ.90 లక్షలకు అమ్మిస్తానని.. రూ.30 లక్షలు లాభం వస్తుందని, కొద్దిపాటి లాభం తనకు ఇస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో మహిళ సంతోషిమాత తన భర్త శ్రీశైలంలో కొద్దిరోజుల కింద ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తం రూ.48.50 లక్షలు తీసుకుని నిందితుడ్ని సంప్రదిం చింది. ఏప్రిల్ 19వ తేదీన కర్నూలు రావాలని సూచించ డంతో ఆమె, ఆమె భర్త ఇద్దరు కలిసి కర్నూలు వచ్చారు. భార్యా భర్తలు సాయిబాబా ఆలయం వద్ద ఉండి బంగారం కొనే సమ యంలో ఎవరూ ఉండకూడదని నమ్మించి కారులో వారి డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. కొత్తబ స్టాండు చేరుకుని అక్కడ కారు వదిలేసి బస్సులో వెళ్లిపోయాడు. ఆ తర్వాత నిందితుడు ఎప్పటికీ రాకపోవడంతో బాధితులు అనుమానం వచ్చి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడ్ని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి 45.91 లక్షలు రికవరీ చేశారు.
Updated Date - Apr 26 , 2025 | 12:55 AM