వీసీగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:57 PM
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కర్నూలు జీజీహెచ్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ శుక్రవారం ఉదయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు.
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కర్నూలు జీజీహెచ్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ శుక్రవారం ఉదయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో యూనివర్సిటీకి అనుబంధంగా మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌ను ఏర్పాటు అవసరం ఉందన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ పి.చంద్రశేఖర్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికరెడ్డి, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ వై.రాధిక సిబ్బంది ఉన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 11:57 PM