రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అదృష్టం
ABN, Publish Date - May 27 , 2025 | 11:32 PM
అంతర్జాతీయ గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి దక్కడం అదృష్ట మని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
మహానాడులో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు, మే 27 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి దక్కడం అదృష్ట మని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కడప జిల్లా మహానాడులో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. చంద్రబాబు లాంటి గొప్ప నాయకత్వంలో తాను మంత్రిగా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని ఏ దేశానికి వెళ్లినా చంద్రబాబు గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. యువనేత, మంత్రి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర చేసి జనంతో మమేకమై టీడీపీని అధికారంలోకి తీసుకురావడంతో కీలకమైన పాత్ర పోషించారన్నారు. ప్రజల కష్టాలు దగ్గర చూసిన వ్యక్తి యువనేత లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతే.. ప్రస్తుతం అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చితీరుతామని టీజీ భరత్ పేర్కొన్నారు.
Updated Date - May 27 , 2025 | 11:32 PM