ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విభజన హామీలను తుంగలో తొక్కిన కేంద్రం

ABN, Publish Date - Jul 24 , 2025 | 12:25 AM

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి విమర్శించారు

ఆళ్లగడ్డలో మాట్లాడుతున్న రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి

రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి

ఆళ్లగడ్డ, జూలై 23(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత అయితే ఇచ్చింది గోరంత మాత్రమే అని అన్నారు. విభజన చట్టంలోని పోలవరాన్ని పూర్తి చేయలేదన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలలోని విమానాశ్ర యాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామని చెప్పి విస్మరించారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. టీడీపీ ఎంపీల మద్దుతునే ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తాలుకా సమన్వయకర్త హుస్సేన్‌బాషా, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి శంషుల్‌హక్‌, డాక్టర్‌ వెస్లీ, సంజయ్‌కుమార్‌, మౌలానా అబ్దుల్‌ మజీద్‌ తదితరులు పాల్గొన్నారు.

బనగానపల్లె: భాగవత సప్తాహం మోక్షప్రాప్తికి సోపానం అని మాజీ ఎంపీ తులసిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటిలో నిర్వహించిన భాగవతసప్తాహం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కంచిరెడ్డి, నారాయణరెడ్డి, బాలకృష్ణారెడ్డి, నరింహులు, బాలుయాదవ్‌, హుసేన్‌, శ్రీనివాసులు, అమర్‌, ఉత్తన్న, సుబ్బారెడ్డి, రాజు, బాబా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:27 AM