మొహర్రంను ప్రశాంతంగా చేసుకోవాలి
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:08 AM
మొహర్రం వేడుకలను ప్రశాంతంగా చేసుకోవాలని పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్, డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు. గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు వేడుకలకు దళితులను రానివ్వడం లేదని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం అధికారులు గుండ్లకొండ గ్రామానికి చేరుకొని పీర్లచావిడి వద్ద గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు
దేవనకొండ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మొహర్రం వేడుకలను ప్రశాంతంగా చేసుకోవాలని పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్, డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు. గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు వేడుకలకు దళితులను రానివ్వడం లేదని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం అధికారులు గుండ్లకొండ గ్రామానికి చేరుకొని పీర్లచావిడి వద్ద గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. కుల మతాలకతీతంగా ప్రశాంత వాతావ రణంలో మొహర్రం వేడుకలను నిర్వహించుకోవాలని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటివారినైన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గతంలోనే గ్రామంలో ఆలయాల్లో దళితులకు ప్రవేశం కల్పించినట్లు డీఎస్పీ గుర్తు చేశారు. అనంతరం దళిత కాలనీలో అధికారులు పర్యటించారు. తహసీల్దార్ రామాంజినేయులు, సీఐ వంశీనాథ్, ఆర్‌ఐ విజయభాస్కర్, వీఆర్వోలు సూరీడు, ఆనంద్ పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 01:08 AM