ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోరుకల్లును పరిశీలించిన సీడీఓ బృందం

ABN, Publish Date - May 13 , 2025 | 11:50 PM

గోరుకల్లు రిజర్వాయర్‌ రాతి పరు పును పున:నిర్మించాల్సిందేనని నిపుణుల బృందం సూచించింది.

గోరుకల్లు రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజింగ్‌ బృందం

పాణ్యం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): గోరుకల్లు రిజర్వాయర్‌ రాతి పరు పును పున:నిర్మించాల్సిందేనని నిపుణుల బృందం సూచించింది. మంగళ వారం సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజింగ్‌(సీడీవో) కమిటీ బృందం రిజర్వాయర్‌ పనులను పరిశీలించింది. ఈ సందర్బంగా సీడీవో సీఈ విజయభాస్కర్‌ మాట్లాడుతూ రిజర్వాయర్‌ పనులు పూర్తికాకముందే రాతిపరుపు కుం గడంపై ప్రత్యేకంగా పరిశీలించామన్నారు. రిజర్వాయర్‌లోని నీటిఒత్తిడితో పాటు రివిట్‌మెంట్‌ కింద ఖాళీ ఏర్పడడంతో నీరు రివిట్‌మెంట్‌లోకి వెళ్లి కుంగినట్లు తెలిపారు. గోరుకల్లు రిజర్వాయర్‌ కట్టను, మట్టికట్ట, రాతిపరుపు కుంగిన ప్రదేశాలను పరిశీలించారు. మట్టి నాణ్యతను పరిశీలించారు. నీటి నిల్వ వివరాలు తెలుసుకున్నారు. కట్ట కుంగిన ప్రదేశాల్లో తిరిగి ఎలా పున ర్మించాలో వివరించారు. రిజర్వాయర్‌ మ్యాపులను పరిశీలించారు. రాతి పరుపు కుంగిన చోట రాళ్లను తొలగించి పున:నిర్మిస్తే తప్ప మళ్లీ కుంగే పరి స్థితి రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. నిర్మాణ పనులు మద్యలో ఆగి పోవడంవంతో ప్రధాన సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. మధ్యలో నిలిచి పోవడంతో నీరు కట్టలో చేరుతుండడం ఇబ్బందిగా మారిందన్నారు. కార్యక్రమంలో సీఈ కబీర్‌, ఎస్‌ఈ శివకామార్‌రెడ్డి, ఈఈ మనోహర్‌, డీఈ లు రీనా, శ్రీనివాసరెడ్డి, కేదార్‌నాథ్‌రెడ్డి, ఈఈలు శుభకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:50 PM