ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరో ఇద్దరికి కరోనా.

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:12 AM

కరోనా మళ్లీ మొదలైంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

పాతగైనిక్‌ విభాగంలో మూతపడ్డ కొవిడ్‌ వార్డు

. ఓ డాక్టర్‌, 25 ఏళ్ల మహిళకు నిర్ధారణ

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కరోనా మళ్లీ మొదలైంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కర్నూలు జీజీహెచ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌కు పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్‌ నిర్ధారణ అయింది. నగరంలోని వెంకటరమణకాలనీకి చెందిన ఈ డాక్టర్‌ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొం దుతున్నారు. మంత్రాలయం మండలం పరమాన్‌దొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరింది. శనివారం మహిళకు కరోనా పరీక్షలు చేయగా.. మంగళవారం మధ్యాహ్నం పాజిటివ్‌గా తేలింది. దీంతో మహిళను వీఐసీ నెగిటివ్‌ ఫ్రెజర్‌ రూంకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కొవిడ్‌ రోగి తిప్పలు

సోమవారం కరోనా నిర్ధారణ అయిన ఎమ్మిగ నూరు మండలం కలుగోట్ల రోగిని పాతగైనిక్‌ విభాగంలోని కొవిడ్‌ వార్డుకు తరలించారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఆ రోగిని వీఐపీ నెగిటివ్‌ ప్రెజర్‌ రూంకు తరలించారు. పాత గైనిక్‌ విభాగంలోని కొవిడ్‌ వార్డుకు బాత్‌రూంలు లేకపోవడంతో రోగికి తరలిం చినట్లు సిబ్బంది చెబుతున్నారు. పాత గైనిక్‌ విభాగంలో కొవిడ్‌ వార్డు ఆవరణలో ఫిమేల్‌ మెడికల్‌ వార్డులు ఉన్నాయి. అక్కడ మహిళా రోగులు ఉన్నచోట కొవిడ్‌ వార్డును ఎలా ఏర్పాటు చేస్తారని బంధువులు మండిపడుతున్నారు. రెండు రోజులుగా కొవిడ్‌ రోగిని అటు ఇటు తిప్పుతుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేసిన శిథిలమైన గైనిక్‌ వార్డుల ప్రత్యేక మైన బాత్‌రూమ్‌లు లేకపోవడంతో పక్కన ఉన్న ఫిమేల్‌ వార్డుల బాత్‌రూంనే వాడుకోవాల్సి వస్తున్నది. అధికారులు స్పందించి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక కొవిడ్‌ వార్డును అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.

భయం వద్దు

కరోనా కొత్త వేరియంట్‌ పట్ల ప్రజలు భయాందోళనలకు గురి కానవసరం లేదు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న రోగులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆయాసం ఉండి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, కిడ్నీ, క్యాన్సర్‌, లివర్‌ వంటి దీర్ఘకా లిక జబ్బులు ఉన్నవారు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసు కోవాలి. కొవిడ్‌ నియంత్రణకోసం కర్నూలు జీజీహెచ్‌లో ఫల్మ నాలజి హెచ్‌వోడీ డా.శ్రీకాంత్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా నియమిం చాం. పాత గైనిక్‌ విభాగంలో పది పడకలతో కొవిడ్‌ వార్డుతోపాటు అవసరమైతే టీబీ వార్డు పక్కన 20పడకలతో ప్రత్యేక కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేయనున్నాం. - డా.డి. శ్రీరాములు, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌

Updated Date - Jun 04 , 2025 | 12:12 AM