ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొనలేం.. తినలేం..!

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:55 PM

కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు ఏమీ కొనలేని.. తినలేని పరిస్థితులు. గత వారం వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న పచ్చిమిర్చి ధర ఒక్కసారిగా భగ్గుమం టోంది.

ప్రజలు లేక వెలవెలబోతున్న మార్కెట్‌

ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు

భగ్గమంటున్న పచ్చి మిర్చి.. కేజీ రూ.80

బీన్స్‌ కేజీ రూ.160

చిక్కుడు రూ.120

బోదిబోమంటున్న వినియోగదారులు

చాగలమర్రి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు ఏమీ కొనలేని.. తినలేని పరిస్థితులు. గత వారం వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న పచ్చిమిర్చి ధర ఒక్కసారిగా భగ్గుమం టోంది. చాగలమర్రి సంతమార్కెట్‌లో పచ్చిమిర్చి కిలో రూ.80 పలికింది. వారం క్రితం కేజీ రూ.30 పలికింది. దీంతో పచ్చిమిర్చి ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రైతులు పండించిన సమయంలో కిలో రూ.20 ఉందని, ఇప్పుడు కాయలు ఎక్కడ లేక పోవడంతో ధర పెరిగిందని రైతులు అంటున్నారు. సీజనల్‌లో మాత్రం ధర తక్కువగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చిమిర్చితో పాటు క్యారెట్‌ కేజీ రూ.80, బెండ రూ.40, చిక్కుడు కేజీ రూ.120, బీన్స్‌ రూ.160, టమోటా కేజీ రూ.50, అల్లం రూ.80 తదితర రకాల కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కూరగాయల ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:55 PM