23న కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:14 PM
సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడి చేపడతామని అం గన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ వెల్లడించింది.
నంద్యాల నూనెపల్లె, జూన్ 19(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడి చేపడతామని అం గన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ వెల్లడించింది. ఈ మేరకు జిల్లాలోని అంగన్‌వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీబారాణి, నిర్మల, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.మద్దు డిమాండ్ చేశారు. గురువారం నంద్యా లలోని ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో పీడీ లీలావతికి వారు విన తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దుచేయాలని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ట్యాబులు ఇవ్వాలని కోరారు.
Updated Date - Jun 19 , 2025 | 11:14 PM