ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బోట్ల ప్రయాణాలు నిలిపివేయాలి

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:57 PM

ఎగువ ప్రాంతాల నుంచి కష్ణానదిలోకి వరద భారీగా వచ్చి చేరుతుంతోందని, ఈ పరిస్థితుల్లో ఇంజిన్‌ బోట్ల ప్రయాణాలు నిలిపివేయాలని తహసీల్దార్‌ శివరాముడు ఆదేశించారు.

బోట్ల నిర్వాహకులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌

నిర్వాహకులకు తహసీల్దార్‌ ఆదేశం

పగిడ్యాల, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల నుంచి కష్ణానదిలోకి వరద భారీగా వచ్చి చేరుతుంతోందని, ఈ పరిస్థితుల్లో ఇంజిన్‌ బోట్ల ప్రయాణాలు నిలిపివేయాలని తహసీల్దార్‌ శివరాముడు ఆదేశించారు. మండలంలోని నెహ్రూనగర్‌ సచివాలయం వద్ద మూర్వకొండ, అర్లపాడు ఘాట్లకు చెందిన బోట్ల నిర్వాహకులతో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ ఎవరైనా బోట్లు తిప్పితే సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. నదిలో ఇంజన్‌ బోట్లు నడపడానికి లైసెన్స్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఘాట్ల వద్ద ప్రతిరోజు రెవెన్యూ, పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడ, మచిలీపట్నం పోర్టుల అధికారులు ఇక్కడికి వచ్చి బోట్లు పరిశీలించి వెళ్తున్నారు తప్ప లైసెన్స్‌ మం జూరు చేయడం నిర్వాహకులు తహసీల్దార్‌కు చెప్పారు. సమావేశంలో డీటీ మధు, ఆర్‌ఐ రంగారెడ్డి, వీఆర్వో హేమలత, ముచ్చుమర్రి ఏఎస్‌ఐ సుబ్బరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:57 PM