నగరంలో బీజేపీ భారీ ర్యాలీ
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:13 AM
కర్నూలు నగరం మంగళవారం కాషాయమం అయింది.
చాయ్‌పే చర్చలో పాల్గొన్న
రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన మాధవ్
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 29(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం మంగళవారం కాషాయమం అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన మాధవ్ పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మున్సిపల్ ఎగ్జిబిషన మైదానం నుంచి కిడ్స్ వరల్డ్, రాజ్‌విహార్ మీదుగా మౌర్యఇన హోటల్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన మాధవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో అధిక సంఖ్య లో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏ.క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి, రాజ్‌విహార్ సర్కిల్‌లోని స్వామి వివేకానందుని విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, టీజీ వెంకటేశ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అమ్మ పేరుతో ఒక మొక్క : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ అనే కార్యక్రమంలో కర్నూలు జిల్లా సారథ్యం మంగళవారం ప్రారంభమైంది. స్థానిక వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన మాధవ్, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో కలిసి బీజేపీ నాయకులు వ్యాయామం చేశారు.
చాయ్‌పే చర్చ: రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని పీవీఎన మాధవ్ తెలిపారు. నగరంలోని స్టేడియం వద్ద వాకర్స్‌తో చాయ్‌పే చర్చ నిర్వహించారు. స్థానికులు మాధవ్‌తో కలిసి టీ తాగుతూ అనేక సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.
Updated Date - Jul 30 , 2025 | 12:13 AM