బైకు దొంగల అరెస్టు
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:37 AM
త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు
కర్నూలు క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ శేషయ్య సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితులు షేక్ బాబ ఫకృద్దీన్ (అన్నమయ్య జిల్లా), షేక్ దాదాపీరా (అన్నమయ్య జిల్లా), హనీఫ్ (కడప)లను అరెస్టు చేశామన్నారు. వారు తెలిపిన వివరాల మేరకు... గూడూరుకు చెందిన చంద్రకుమార్ మే 22వ తేదీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. పార్కింగ్‌లో ఉంచిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 23 మోటారు సైకిళ్లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్నూలు, నంద్యాల, గుంతకల్లు, హైదరాబాదు, నార్పల, అనంతపురం జిల్లాలో పలు బైక్ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుబాన్, షాపీర్ అనే నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Jul 15 , 2025 | 12:38 AM