భానుడి ఉగ్రరూపం
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:43 PM
ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
పాణ్యంలో అత్యధికంగా 43.91 డిగ్రీల నమోదు
మంత్రాలయంలో 43.59 డిగ్రీలు
రాత్రి గాలి లేక ఉక్కపోత..
ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ విపత్తుల శాఖ అదికారులు రోజురోజుకు ఎండలు పెరిగి పోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పాణ్యంలో 43.91డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది. రుద్రవరంలో 43.48, దొర్నిపాడులో 43.10, బండిఆత్మకూరులో 43.09, గోస్పాడులో 42.83, నంద్యాలలో 42.79, మహానందిలో 42.74, జూపాడుబంగ్లాలో 42.42, గడివేములలో 42.40, ఆళ్లగడ్డలో 42.36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో 43.59, కర్నూలు నగరంలో 43.00, కోడుమూరులో 42.79, కౌతాళంలో 42.50, కోసిగిలో 42.00, ఆస్పరిలో 41.53, వెల్ధుర్తిలో 41.49, ఓర్వకల్లులో 41.29, సి.బెళగల్‌లో 41.29, కల్లూరులో 41.24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది.
Updated Date - Apr 24 , 2025 | 11:43 PM