ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భానుడి భగభగలు

ABN, Publish Date - May 10 , 2025 | 12:22 AM

రెండురోజుల పాటు కురిసిన వర్షంతో కాస్త చల్లబడి ఉపశమనం కల్పించగా, శుక్రవారం భానుడు మరోసారి భగ్గుమన్నాడు.

నిర్మానుష్యంగా నంద్యాల ఎన్జీవోస్‌ కాలనీ

మండుతున్న ఎండలు

అల్లాడుతున్న ప్రజలు

అవుకు, పాములపాడులో 41.47డి.సె అత్యధిక ఉష్ణోగ్రత

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): రెండురోజుల పాటు కురిసిన వర్షంతో కాస్త చల్లబడి ఉపశమనం కల్పించగా, శుక్రవారం భానుడు మరోసారి భగ్గుమన్నాడు. ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. అవుకు, పాములపాడులో 41.47 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల 40.82, బనగానపల్లె 40.45, పాణ్యం 40.4, రుద్రవరం 40.37, కోవెలకుంట్ల 40.34, బండిఆత్మకూరు 40.06, శిరువెళ్ల 40.05, చాగలమర్రి 39.93, గోస్పాడు 39.79, సంజామల 39.62, గడివేముల 39.59, నందికొట్కూరు 39.52, కొత్తపల్లె 39.49, ఆళ్లగడ్డ 39.45, జూపాడుబంగ్లా 38.96 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది.

తేలికపాటి వర్షాలు పడే అవకాశం?

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాబోయే ఐదురోజుల పాటు చిరుజల్లుల నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.1డిగ్రీల సెల్సియస్‌ నుంచి 41.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థ వెల్లడించింది. సాయంత్రం, రాత్రివేళ ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, ఆ సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచవద్దని వాతావరణ సంస్థ సూచించింది.

Updated Date - May 10 , 2025 | 12:22 AM