ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడాది పాలన భేష్‌

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:20 AM

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ సుపరిపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆలూరు టీడీపీ ఇన్‌ చార్జి వీరభద్రగౌడ్‌ అన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావడంతో గురువారం ఆలూరులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు

పత్తికొండలో మాట్లాడుతున్న తుగ్గలి నాగేంద్ర

టీడీపీ నాయకుల సంబరాలు

ఆలూరులో బైక్‌ ర్యాలీ

ఆదోనిలో కేక్‌ కట్‌ చేసిన నాయకులు

పత్తికొండలోనూ వేడుకలు

ఆలూరు, జూన్‌12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ సుపరిపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆలూరు టీడీపీ ఇన్‌ చార్జి వీరభద్రగౌడ్‌ అన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావడంతో గురువారం ఆలూరులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముందుగా పట్టణంలో భారీఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తల నడుమ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వీరభద్రగౌడ్‌ మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రణాళికాబద్ధంగా నిర్ణయా లు తీసుకుంటున్నారన్నా రు. ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు తల్లికి వంద నం ద్వారా కుటుంబంలో చదువుకునే వారందరికీ రూ.15వేలు తల్లుల ఖాతా ల్లో జమ చేస్తారన్నారు. ప్రధాని మోదీ సహకా రంతో రాష్ట్ర అభివృద్ధికి అడుగులు పడుతున్నాయ న్నారు. కార్యక్రమంలో ఏబీసీ డీసీ చైర్మన్‌ నగరడోణ కిష్టప్ప, బీజేపీ ఇన్‌చార్జి వెంకటరాముడు, టీడీపీ కన్వీనర్‌ అశోక్‌, పరమారెడ్డి, గిరి మల్లేష్‌గౌడ్‌, రఘుప్రసాద్‌రెడ్డి, అట్టేకల్‌ బాబు, మార్గదర్శి రమేష్‌, శివప్రకాష్‌, కృష్ణంనాయుడు, హరిరెడ్డి, నరసప్ప, కొమ్ము రామంజి, సతీష్‌, నౌనేపాటి చౌదరి, అంపయ్య, మల్లి, మసాల జగన్‌, గూళ్యం రామాంజి, రాముయాదవ్‌, సర్పంచ్‌ మోహన్‌రాజ్‌ పాల్గొన్నారు.

పత్తికొండలో విజయోత్సవం

పత్తికొండ: పార్టీ నాయకులు సాంబశివారెడ్డి, తుగ్గలి నాగేంద్ర, బత్తిని వెంకట్రాముడు ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. మార్కెట్‌యార్డ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఏడాది పాలనలో ఎమ్మెల్యే శ్యాంబాబు నియోజకవర్గాన్ని అబివృద్ధి చేశారన్నారు. మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ ఆలంకొండ నబీ, మర్రిశ్రీరాములు, వెల్దుర్ధి సుబ్బరాయుడు, మద్దికెర ధనుంజయుడు, మనోహర్‌చౌదరి, చందోలి తిరుపాల్‌, రామానాయుడు, సురేష్‌కుమార్‌, చల్లారవి, తిమ్మయ్యచౌదరి, సోమ్లానాయక్‌, కడవలసుధాకర్‌, బీటీ గోవిందు పాల్గొన్నారు.

దేవనకొండ: టీడీపీ ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి దిశలో సాగుతోందని వాల్మీకి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కప్పట్రాళ్ల బొజ్జమ్మ అన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో టీడీపీ కార్యాలయం వద్ద కేకు కట్‌ చేశారు అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు, కన్వీనర్‌ విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

ఆదోని: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ ఏడాది పాలన సాగిందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. కూటమి నాయకులు స్వకులసాలే నాయకులు మారుతీరావు, చాగి మల్లికార్జున రెడ్డి, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, సాధికా బేగం, కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చడం ఆనం దంగా ఉందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన అవినీతి అక్ర మాలు, నేరాలకు నిలయంగా మారిందన్నారు. టీడీపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడం గర్వకారణ మన్నారు. నీలకంఠ, అల్లాఫ్‌, వెంకటరెడ్డి, వెంకటేఫ్‌, అయ్యన్న, అమర్‌ ప్రకాష్‌, సుబ్బు, ఈరన్న, అన్వర్‌ బాష, శ్రీదేవి పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:20 AM