ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగా సాధనతో ప్రయోజనం

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:02 AM

నిత్యం యోగా సాధనతో ప్రయో జనం ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

‘యోగాంధ్ర’లో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, జూన 21(ఆంధ్రజ్యోతి): నిత్యం యోగా సాధనతో ప్రయో జనం ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శని వారం అంతరాజతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నటే కూరు ఐఐటీ అకాడమి జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్ర మానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. సెట్కూరు ముఖ్య కార్య నిర్వహణ అధికారి వేణుగోపాల్‌, కర్నూలు జిల్లా కో-ఆర్డినేటర్‌ శ్రీదేవి, ఎం పీడీవో జి.నాగశేషాచలరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో యోగా వేడుకలను ఘ నంగా జరుపుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులతో కలిసి యోగాస నాలు వేశారు. ఏపీఏడబ్ల్యూ జూనియర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, ఆయుష్‌ డాక్టర్‌ రజాక్‌, చిన్నటేకూరు సెక్రటరి గోవింద్‌, సర్పంచు టి.లక్ష్మన్న రామాంజనేయులు, బజారి పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌: యోగాతో సంపూర్ణ ఆరోగ్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం కర్నూలు మండలం పసుపుల గ్రామంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యా యులు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని అందరి తోపాటు యోగాసనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు యోగాసనాలకు కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగంగా పసుపుల గ్రామ సచివాలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు బొగ్గుల శీలమ్మ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఎంపీడీవో రఘునాథ్‌, పంచాయతీ కార్యదర్శి హేమంతకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫ కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థుల తో కలిసి ఎంపీ యోగాసనాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు కృష్ణయాదవ్‌, రఫీక్‌, సచివాలయ ఉద్యోగులు, ప్రధానోపాధ్యా యుడు చంద్రశేఖర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:03 AM