ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేశ సంస్కృతికి పాటుపడిన వ్యక్తి బళ్లారి రాఘవ

ABN, Publish Date - Aug 02 , 2025 | 11:38 PM

బళ్లారి రాఘవ దేశ సంస్కృతికి పాటుబడిన వ్యక్తి అని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) సి.వెంకటనారాయణమ్మ కొనియాడారు.

బళ్లారి రాఘవకు నివాళి అర్పిస్తున్న డీఆర్వో, సిబ్బంది

డీఆర్వో వెంకటనారాయణమ్మ

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): బళ్లారి రాఘవ దేశ సంస్కృతికి పాటుబడిన వ్యక్తి అని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) సి.వెంకటనారాయణమ్మ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో బళ్లారి రాఘవ జయంతిని టూరిజం, ఐసీడీఎస్‌ పీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి విశేషమైన కృషి చేసిన కళాకారుడిగా దేశ విదేశాల్లో పేరు గడిచారని తెలియాజేశారు. బళ్లారి రాఘవ న్యాయవాదిగా ఉన్న సమయంలో పేదలను ఆదుకునేవారని తెలిపారు. అనంతరం టూరిజం, ఐసీడీఎస్‌ పీడీ పీ.విజయ మాట్లాడుతూ బళ్లారి రాఘవ కర్నూలుకు చెందిన కృష్ణమ్మను వివాహం చేసుకున్నారని, బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. రావుబహదూర్‌ అన్న బిరుదు కూడా ఇచ్చి సత్కరించిందని తెలిపారు. సమావేశానికి డిస్ర్టిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆర్గనైజర్‌ శారద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 11:38 PM