రమణీయం.. సాయిబాబా రథోత్సవం
ABN, Publish Date - May 03 , 2025 | 01:12 AM
మండలంలోని పులకుర్తి గ్రామంలో సద్గురు సాయిబాబా రథోత్సవం శుక్రవారం సాయంత్రం రమణీయంగా సాగింది.
కోడుమూరు రూరల్, మే 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని పులకుర్తి గ్రామంలో సద్గురు సాయిబాబా రథోత్సవం శుక్రవారం సాయంత్రం రమణీయంగా సాగింది. ఉదయం ఆలయంలో అభిషేకా లు, హారతి పూజలు నిర్వహించారు. సాయంత్రం పూలమాలలతో అలంకరించిన రథంపై సాయిబాబా ఉత్సవ విగ్రహాన్ని కొలువుంచి వేదపండితులు కొండమడుగు శివసుబ్రమణ్యశర్మ, నరసింహశర్మ అధ్వర్యంలో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. రథానికి గుమ్మడి, టెంకాయలు కొట్టి సాత్విక బలిదానం సమర్పించారు. అనంతరం భక్తు లు సాయి నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. రథోత్సవంలో గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్దఎత్తున పాల్గొన్నారు. నిర్వాహకులు స్థానిక జడ్పీ పాఠశాల మైదానంలో కబడ్డీ పోటీలు ప్రారంభించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరుగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
Updated Date - May 03 , 2025 | 01:12 AM