రమణీయం.. ప్రహ్లాదరాయల వెండి రథోత్సవం
ABN, Publish Date - Apr 03 , 2025 | 12:43 AM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
మంత్రాలయం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. బుధవారం చైత్ర మాస చవితి శుభదినాన్ని పురస్క రించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అర్చ కులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావనాన్ని బంగారు, వెండి, పట్టువస్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. పూర్ణబోధపూజ మందిరంలో ఉత్సవమూర్తికి పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించారు. మూలరాములు, జయరాములు, దిగ్విజ యరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు. అనంతరం వెండి రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, వేద పండితుల మంత్రో చ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహామంగళహారతులు ఇచ్చి ప్రాంగణం చుట్టూ ఊరే గించారు. అనంతరం ఊంజల సేవ నిర్వహించారు.
Updated Date - Apr 03 , 2025 | 12:43 AM