రమణీయం.. చెన్నకేశవస్వామి రథోత్సవం
ABN, Publish Date - May 13 , 2025 | 12:16 AM
మండల కేంద్రమైన ఓర్వకల్లులో చెన్నకేశవస్వామి రథోత్సవం అశేష భక్తుల మధ్య రమణీయంగా సాగింది.
ఓర్వకల్లు, మే 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన ఓర్వకల్లులో చెన్నకేశవస్వామి రథోత్సవం అశేష భక్తుల మధ్య రమణీయంగా సాగింది. సోమవారం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. స్వామి, అమ్మవా ర్లను రథంపై అదిష్టించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. స్వామి, అమ్మ వార్లకు పురోహితులు విష్ణుశర్మ, అర్చకులు నారాయణరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవానికి ప్రత్యేక పుష్పాలతో అలం కరణ చేసి పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు. ఆలయం ముందు నుంచి రథాన్ని లాగి ఊరేగించి యథాస్థానంలో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆధ్వ ర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, వెంకటరమణారెడ్డి, లలితమ్మ, కురువ లక్ష్మీదేవి, వడ్డె భువనేశ్వరి, బోయ లక్ష్మీదేవి, దేవయ్య, రవిశంకర్, గ్రామ నాయకులు గోవిందరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అబ్దుల్లా, అల్లాబాబు, ప్రజలు పాల్గొన్నారు.
శకునాలలో: మండలంలోని శకునాల గ్రామంలో చెన్నకే శవస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరై స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మనోహర్ శర్మ, జంగం శివనాగయ్య రథానికి పూజలు చేశారు. రథాన్ని లాగి యథాస్థితిలో నిలిపారు. శకునాల గ్రా మంలో చెన్నకేశవస్వామి వారిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, అర్చకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో గ్రీన కో ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ శ్రీనివాసరావు, మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన మల్లికార్జున రెడ్డి, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస నాయుడు, గ్రామ నాయకులు మౌళీశ్వ రరెడ్డి, రామాం జనేయులు, హరికృష్ణగౌడు, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 12:16 AM