ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:53 PM

సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌ ఆదేశించారు.

వీడియో సమావేశం ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతున్న సీఎస్‌

వీసీలో సీఎస్‌ విజయానంద్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌ / నంద్యాల టౌన్‌, జులై 10 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ రాజకుమారి, జేసీ విష్ణుచరణ్‌లతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర-2047, పీ4 ఫౌండేషన్‌, రిలయన్స్‌ కంప్రెస్ట్‌ బయోగ్యాస్‌ యూనిట్లు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ చర్యలు తదితర అంశాలపై సచివాలయం నుంచి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్‌ రాజకుమారి సీఎస్‌కు వివరించారు. పీ4 సర్వే జరుగుతోందని, సీజనల్‌ వ్యాధులపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో డీఆర్‌వో రామునాయక్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:53 PM