టీడీపీలోనే బీసీలకు గుర్తింపు
ABN, Publish Date - Jun 09 , 2025 | 11:48 PM
తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాలదని.. తమ పార్టీ అందరిదని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి
మార్కెట్‌యార్డు చైర్మన్‌గా కురువ మల్లయ్య ప్రమాణస్వీకారం
ఎమ్మిగనూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాలదని.. తమ పార్టీ అందరిదని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. టీడీపీలో పదవులు కొందరికే కాదని అందరికి సొంతమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తన నియోజకవర్గంలో నిరూపించారన్నారు. సోమవారం ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్షుడిగా కురువ మల్లయ్య, వైస్ చైర్మన్‌గా బోయ అంజితో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎంపికలో సామాజిక న్యాయం పాటించి అన్నివర్గాల వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేయడం అభినంద నీయమన్నారు. ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ సామాజిక న్యాయంతో ముందుకు సాగుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో పార్టీకోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ పదవులు వస్తాయన్నారు. కార్యక్రమంలో కురువ, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్లు దేవేంద్రప్ప, బొజ్జమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర రావు యాదవ్, మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Updated Date - Jun 09 , 2025 | 11:48 PM