ఘనంగా బసవ జయంతి
ABN, Publish Date - May 01 , 2025 | 12:29 AM
స్థానిక పేట మల్లేశ్వర స్వామి ఆలయంలో బసవేశ్వరస్వామి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.
కోడుమూరు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): స్థానిక పేట మల్లేశ్వర స్వామి ఆలయంలో బసవేశ్వరస్వామి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో శివలింగం, పార్వతిదేవి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నందీశ్వరుడు విగ్రహాలకు మహా రుద్రాభిషేకం, పంచద్రవ్యాభిషేకం తదితర పూజలు చేశారు. అనంతరం వీరశైవుల శివా ష్టోత్తర శతనామావళి, బసవేశ్వర శతనామావళి, బిల్వాష్టకం, లింగా ష్టకం, కుంకుమార్చన వంటి కార్యక్ర మాలు నిర్వహించారు. సాయంత్రం బసవేశ్వర స్వామి చిత్రపటాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో ఎస్‌జీ శంకర్‌బాబు, వీరప్ప, బసన్నశెట్టి, దామోదర్, శ్రీకాంత్, చంద్రశేఖర్, రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
కర్నూలు కల్చరల్: నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో సాహితి స్రవంతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన మాట్లాడుతూ భూమిపై శ్రమజీవులతోనే సమాజం నిర్మితమైందని మానవత్వమే ఈ సమాజానికి జీవనా ధార మని చాటి చెప్పిన విశ్వగురువు బసవేశ్వరుడే అని అ న్నారు. అనం తరం ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పిం చారు. సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు బసవరాజు, విరసం నాయకులు నాగేశ్వర ఆచారి పాల్గొన్నారు.
Updated Date - May 01 , 2025 | 12:29 AM