ఎంవీఐపై కర్ణాటక వాసి దాడి
ABN, Publish Date - May 23 , 2025 | 12:21 AM
మా వాహనాన్నే ఆపుతావా అని ఆదోని ఎంఈఐపై కర్ణాటక వాసులు దాడికి పాల్పడ్డారు. వివరాల మేరకు.. ఆస్పరి బైపాస్‌లోని విరుపాపురం సమీపంలో ఆదోని మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కదిరి మహమ్మద్ అవైద్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
తమ వాహనాన్ని ఆపారని ఆగ్రహం
ఆదోని రూరల్, మే 22 (ఆంధ్రజ్యోతి): మా వాహనాన్నే ఆపుతావా అని ఆదోని ఎంఈఐపై కర్ణాటక వాసులు దాడికి పాల్పడ్డారు. వివరాల మేరకు.. ఆస్పరి బైపాస్‌లోని విరుపాపురం సమీపంలో ఆదోని మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కదిరి మహమ్మద్ అవైద్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇంతలో కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నాలూరు తాలుక హోసావెళ్లి గ్రామానికి చెందిన చంద్రప్ప, కుటుంబ సభ్యులు 14 మంది మినీ బస్సులో మంత్రాలయంలో దర్శనం అనం తరం కర్ణాటకకు తిరుగు ప్రయాణమయ్యారు. తన విధుల్లో భాగంగా ఎంవీఐ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా చంద్రప్ప కుటుంబ సభ్యులు ఎంవీఐతో వాగ్వాదానికి దిగారు. నీవు అసలు ఎంవీఐవేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రయ్య సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా, ఎంఈవై సెల్‌ఫోన్ లాక్కొని పగులకొట్టి తన వాహనం స్టార్ట్ చేయగా, కర్ణాటక వాసి చంద్రప్ప ఎంవీఐ వాహనం బంపర్‌పై కూర్చున్నా ఎంఈవై కిలోమీటర్ వరకు అలాగే వాహనాన్ని నడిపారు. దీంతో మినీబస్సు డ్రైవర్ ప్రకాష్ తన వాహనాన్ని వేగంగా తీసుకెళ్ళి ఎంవీఐ వాహనానికి అడ్డంగా పెట్టాడు. అప్పటికే ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకొన్న తాలుక ఎస్.ఐ రామాంజనేయులు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఎంవీఐ కర్ణాటక వాసి చంద్రయ్యపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
Updated Date - May 23 , 2025 | 12:21 AM