ఏటీఎం కార్డు మార్చి రూ.50 వేలు చోరీ
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:58 AM
మేడం.. ఏటీఎం పిన్ నంబర్ తప్పు కొట్టారు. అంటూ ఆ యువతి పెట్టిన ఏటీఎం కార్డును బైటికి తీసి, కార్డు మార్చి రూ.50 వేలు కొట్టేసిన ఘటన ఆదోని పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఆదోని, జూలై 1(ఆంధ్రజ్యోతి): మేడం.. ఏటీఎం పిన్ నంబర్ తప్పు కొట్టారు. అంటూ ఆ యువతి పెట్టిన ఏటీఎం కార్డును బైటికి తీసి, కార్డు మార్చి రూ.50 వేలు కొట్టేసిన ఘటన ఆదోని పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన ఓ యువతికి ఆదోని పట్టణంలోని యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆమె ఎమ్మిగనూరు టర్నింగ్‌లో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లింది. తన ఏటీఎం కార్డు మిషన్‌లో పెట్టి పిన్ నంబర్ కొట్టగానే.. అక్కడే ఉన్న ఓ యువకుడు ఏటీఎం కార్డు బైటికి తీసి పిన్ తప్పు కొట్టారు మేడం.. అంటూ నమ్మబలికాడు. అక్కడే ఉన్న ఇంకో వ్యక్తి కూడా అదే మాట అని ఏటీఎం కార్డు మార్చేశారు. వారు మార్చి ఇచ్చిన ఏటీఎం కార్డును ఆమె మిషన్‌లో పెట్టి పిన్ నంబర్ కొట్టగా రాంగ్ అని చూపడంతో ఏటీఎం సెంటర్ నుంచి ఆమె బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇద్దరు యువకులు కూడా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఐదు నిమిషాల్లో ఆ యువతికి తన అకౌంట్ నుంచి రూ.49,990 డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. తన అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ను చెక్ చేసుకుంది. నిజగానే రూ.49,990 డ్రా అయినట్లు, మిగతా రూ.34 వేలు ఉన్నట్లు అకౌంట్ చూపించింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రామస్వామి విచారణ చేయడంతో హర్యానాకు చెందిన సచిన్ అనే వ్యక్తి అమౌంట్ డ్రా చేసుకున్న ట్లుగా తెలిసింది. వెంటనే సైబర్ క్రైమ్ వారికి ఆ యువతి ఫిర్యాదు చేసింది.
Updated Date - Jul 02 , 2025 | 12:59 AM